ఇంకాసేపట్లో ఐర్లాండ్ లోని డబ్లిన్ వేదికగా ఇండియా మరియు ఐర్లాండ్ జట్ల మధ్య రెండవ టీ 20 జరగనుంది. మొన్ననే జరిగిన మొదటి టీ 20 లో ఐర్లాండ్ జట్టు అనుభవజ్ఞులైన ఇండియా చేతిలో ఘోరంగా ఓటమి చెందింది. ఆ రోజు వర్షం కారణంగా పూర్తి ఓవర్ ల ఆట సాధ్యం కాలేదు. కేవలం 12 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది... దీనితో ఐర్లాండ్ ఓటమి పాలు అయింది. దీనితో కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని కసిగా బరిలోకి దిగనుంది. అయితే ఈ రోజు ఉదయం నుండి మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. అక్కడ వర్షాలు పడుతుండడమే దీనికి కారణం. అయితే వర్షం ఏమీ లేనట్లే అనిపిస్తోంది. ఈరోజు అభిమానులు అంతా పూర్తి ఓవర్ ల ఆటను చూసే అవకాశం ఉంది.

మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ తీసుకున్నాడు. మరి ఇండియా ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపైన మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఇండియా పాలు మార్పులను చేసింది.. అందులో భాగంగా ఈ రోజు ఋతురాజ్ ప్లేస్ లో  శాంసన్ మ్యాచ్ ఆడనున్నాడు... ఇక అవేశ్ ఖాన్ మరియు చాహల్ ల స్థానంలో  హర్షల్ మరియు బిష్ణోయ్ లు బరిలోకి దిగుతున్నారు. మరి ఈ రోజు ఎవరు మ్యాచ్ ను గెలవనున్నారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే ఐర్లాండ్ జట్టు సంచలనాలకు మారుపేరు అని తెలిసిన విషయమే. కానీ వీరికి బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. కానీ బ్యాటింగ్ లో కాస్త తడబడుతోంది.. ముఖ్యంగా స్టిర్లింగ్ కాసేపు క్రీజులో ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయి కానీ అనవసరంగా తొందరపడి వికెట్ ను పోగొట్టుకుంటున్నాడు... మరి ఈ రోజు అయినా అంచనాలకు మించి రాణిస్తాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: