గత కొంత కాలం నుంచి టీమిండియాలో కెప్టెన్సీ చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్గా మారబోయేది ఎవరు అన్నదానిపై ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ తర్వాత కె.ఎల్.రాహుల్ కెప్టెన్ అనుకున్నప్పటికీ ఇక ఇటీవల కె.ఎల్.రాహుల్ గాయపడటంతో రిషబ్ పంత్ ఇండియా కెప్టెన్సీ అందుకున్నాడు. అతని కెప్టెన్సీపై మిశ్రమ స్పందనలు వచ్చాయనే విషయం తెలిసిందే. సొంత గడ్డపై టీమిండియా గెలిపించాల్సిన పంత్ చివరికి సిరీస్ సమం చేశాడు.


 కాగా ఐర్లాండ్ పర్యటనకు రిషబ్ పంత్ కు  విశ్రాంతినిచ్చి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్ లో అతని కెప్టెన్సీలోనే గుజరాత్ సైతం టైటిల్ అందుకుంది. మొదటి ప్రయత్నంలోనే చాంపియన్గా నిలిచింది. హార్దిక్ పాండ్య జట్టును నడిపించిన తీరు పట్ల ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో టి20 కెప్టెన్సీ కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హార్థిక్ పాండ్యా ని భారత జట్టులో గోల్డెన్ లెగ్ గా బిసిసిఐ సెలెక్టర్లు భావిస్తున్నారట.


 ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమైనప్పుడల్లా ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించాలని బిసిసిఐ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా పలు సిరీస్ లు ఆడుతుంది. ఇక ఈ షెడ్యూల్లో కొన్ని సిరీస్ లకు రోహిత్ కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసుకుందట బీసీసీఐ. అయితే ఇప్పటికైతే రోహిత్ స్థానంలో వేరే కెప్టెన్ నియమించే అవకాశం లేదు కానీ అతని పై పని ఒత్తిడి తగ్గించే మార్గాలు అన్వేషిస్తున్నాము అని బీసీసీఐ సెలెక్టర్లు ఒకరు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిబట్టి హార్దిక్ పాండ్యాను ఇక రోహిత్ లేని సమయంలో కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: