ఇటీవలే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం జరగగా ఏకంగా 48 వేల కోట్ల రూపాయలు బిసిసిఐకి ఆదాయం వచ్చింది. దీంతో ఐపీఎల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ పలు మార్పులు చేర్పులు చేయాలని బిసిసీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు కూడా భాగం అవుతూ ఉంటారు. ఇక అలాంటి సమయంలోనే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తో చర్చలు జరిపి ఐసీసీ షెడ్యూల్ లోనే ఐపీఎల్కు ప్రత్యేకమైన షెడ్యూల్ ఏర్పాటు చేసేలా చర్చలు జరుపుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.


 ఇటీవల ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు నెలలపాటు కాదు ఏకంగా రెండున్నర నెలల పాటు నిర్వహించేందుకు బీసీసీఐ చర్యలు ముమ్మరం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ ఐపీఎల్ చేరుస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ పాల్గొనే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరో రెండు వారాల ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు  అయితే మరిన్ని ఫ్రాంచైజీ లను ఏర్పాటు చేయాలని ఆలోచన లేదని.. కానీ ప్రస్తుతం ఉన్న పది ఫ్రాంచైజీ లతోనే  ఐపీఎల్ నిర్వహిస్తామంటూ చెప్పుకొచ్చారు.


 ఈ మేరకు అటు ఐసీసీ తో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డుల తో  కూడా చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఐపీఎల్ను విస్తరించే క్రమంలో అటు నాణ్యత విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ ఆయన తెలిపారు. ఐపిఎల్ లో ఆడే ఆటగాళ్ల అందరికీ కూడా అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు రెండు నెలలపాటు 74 మ్యాచ్ లు నిర్వహించే వారు బిసిసీఐ అధికారులు.. కానీ ఇప్పుడు రెండున్నర నెలలపాటు నిర్వహిస్తే మ్యాచ్ ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇటు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ సరికొత్తగా ప్రారంభం కాబోతుంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl