ఇటీవలే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా అక్కడ రెండు మ్యాచ్ ల టి-20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో భాగంగా టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే  హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇప్పుడు ఎంతగానో ప్రశంసలు కురుస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 108 పరుగుల చేయగా.. తర్వాత చేదనకు  దిగిన భారత జట్టు 9.2 ఓవర్లలో 111 పరుగులు చేసింది అని చెప్పాలి.


  తర్వాత రెండో మ్యాచ్లో పలు మార్కులతో టీమిండియా బరిలోకి దిగుతుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి రాగా.. మరి కొన్ని మార్పులతో బరిలోకి దిగింది. అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఉత్కంఠభరిత పోరులో ఒకానొక దశలో ఐర్లాండ్ తెలుస్తుందేమో  అని విధంగానే మారిపోయింది పరిస్థితి. అయినప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో చివరికి విజయం వరించింది.


 అయితే ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2 టి20 మ్యాచ్ గెలిచి అటు ఐర్లాండ్ ను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది టీమిండియా. అదే సమయంలో ఒక చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. భారత ఇన్నింగ్స్ లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగారు. దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్,, హర్షల్ పటేల్ లు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరారు.  ఇన్నింగ్స్ లో టీమిండియా తరఫున టి-20లో ఎక్కువ గోల్డెన్ డక్ లు అవ్వటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇలా హార్దిక్ పాండ్యా క్లీన్స్వీప్ చేసినప్పటికీ కూడా చెత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: