ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. జులై 1వ తేదీ నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఈ టెస్ట్ మ్యాచ్ పైనే ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ ముగించుకున్న టీమిండియా ఆటగాళ్లు ఇక నేరుగా అటు ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేశారు. అదే సమయంలో గత కొంత కాలం నుంచి వరుసగా టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు మాత్రం సత్తా చాటుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడింది ఇంగ్లాండ్ జట్టు.


 ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అటు ఇంగ్లాండ్ జట్టు పైచేయి సాధించింది అని చెప్పాలి. ప్రత్యర్థి న్యూజిలాండ్  పై పూర్తి ఆధిపత్యం సాధించి 3-0 తో క్లీన్స్వీప్ చేసింది.  ఇలా టీమిండియాతో ఐదవ టెస్ట్ మ్యాచ్ కి ముందు అటు ఇంగ్లాండ్ జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఉంది అని చెప్పాలి. ఇక అదే సమయంలో ఇంగ్లాండ్ పిచ్లపై మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు ఎంతగానో కలిసి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉండగా ఒకవేళ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.


 ఈ క్రమంలోనే ఎవరు ఎలా రాణించబోతున్నారు  అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ టీమిండియా మాత్రం వాళ్ళని చూసి భయపడదు అంటూ వ్యాఖ్యానించాడు. రెడ్ బాల్ క్రికెట్ లో భారత జట్టు ఇంగ్లాండ్ కు దీటుగా బదులిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు కెవిన్ పీటర్సన్. ఇకపోతే ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లను పూర్తిచేసుకున్న టీమిండియా బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: