రేపు ఇంగ్లాండ్ తో ఇండియా గతంలో నిలిచిపోయిన ఆఖరి టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ కు కెప్టెన్ గా సీనియర్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ నియమించింది. కరోనా కారణంగా రోహిత్ శర్మను ఈ టెస్ట్ కు దూరం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. దీనితో బుమ్రాకు ఇది ఒక ఛాలెంజ్ గా మారింది అని చెప్పాలి. ఇప్పటి వరకు తన క్రికెట్ కెరీర్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా లేకపోవడం గమనార్హం. అయితే రేపు జరగబోయే టెస్ట్ లో జట్టును ఏ విధంగా ముందుండి నడిపిస్తాడు అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం అతనిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు.

గతంలో కేవలం కపిల్ దేవ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్ గా ఉండి జట్టును అద్భుతంగా సక్సెస్ ఫుల్ గా ముందుండి నడిపించాడు. అతని తరువాత కెప్టెన్ అయిన స్పీడ్ బౌలర్ గా బుమ్రా రికార్డులో కెక్కాడు. బుమ్రా కు ఇది ఒక కాటన్ సవాలు అని చెప్పాలి. అన్ని విభాగాలలో ఎంతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఓడించడం అన్నది చాల కఠినతరం అని చెప్పాలి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్. ఇందులో మూడు మ్యాచ్ లను క్లీన్ స్వీప్ చేసి మిగిలిన టెస్ట్ జట్లు అందరికీ డేంజర్ బెల్స్ పంపించారు.

ఇప్పుడు బెన్ స్టోక్స్ లాంటి దూకుడైన కెప్టెన్ మరియు కోచ్ ఇంగ్లాండ్ కి ఉండడం శుభపరిణామం అని చెప్పవచ్చు. అయితే కెప్టెన్ గా మాత్రమే బుమ్రా ఉంటాడు కానీ.. అడుగడుగున ఇతనిని నడిపించడానికి జట్టులోని సభ్యులు అంతా సిద్ధంగా ఉంటారు. ఇక ఫామ్ లో నలేని విరాట్ గాడినపడి... మిగిలిన ఆటగాళ్లు అందరూ సరైన ప్రదర్శన చేస్తే ఎంతటి బలమైన జట్టును అయినా ఓడించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: