కేఎల్ రాహుల్ ఇటీవలే గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజుల నుంచి టీమిండియా ఆడుతున్న వరుస సిరీస్ లకు కేఎల్ రాహుల్ దూరంగానే ఉంటున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా టీమిండియాకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల సౌతాఫ్రికాలో కేఎల్ రాహుల్ కు టీమిండియా కెప్టెన్సీ వహించే అవకాశం వచ్చినప్పటికీ అతను గజ్జల్లో గాయం కారణంగా దూరం కావడంతో ఇక చివరికి రిషబ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇక కేఎల్ రాహుల్ అటు ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కి కూడా అందుబాటులో ఉండే ప్రసక్తి లేదు అన్నది తెలుస్తుంది.



 ప్రస్తుతం బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో గాయం నుంచి కోరుకుంటున్నాడు కె.ఎల్  రాహుల్.  అయితే ఇటీవలే గజ్జల్లో గాయం కావడంతో జర్మనీ వైద్యులు కె.ఎల్.రాహుల్ కు శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ శస్త్ర చికిత్స ఎంతో విజయవంతంగా పూర్తి చేసారట వైద్యులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడుతున్నట్లు  తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో తెలుపుతూ త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను అంటూ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోని రాహుల్ పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు అందరూ కూడా కె.ఎల్.రాహుల్ త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు అనే చెప్పాలి.



 ఇకపోతే  అక్టోబర్ నెలలో టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేయాలని బిసిసిఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అటు సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ పాటు ఐర్లాండ్ పర్యటనకు ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు కూడా కె.ఎల్.రాహుల్ దూరం అయ్యాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆటకి దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ను పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: