ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక మాధ్యంలో ఎంతలా కూరుకు పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అటు ప్రకృతి కూడా పగబట్టినట్లుగానే వ్యవహరిస్తున్నదని అర్థమవుతోంది. ఇటీవలే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలివాన కారణంగా బీభత్సం జరిగింది.  ఉదయం సమయం లో కురిసిన భారీ వర్షాల దెబ్బకు లంకలో ఉన్న చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి అని చెప్పాలి.


 వర్ష బీభత్సం దానికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇటీవల శ్రీలంక ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్కు వేదికగా ఉన్న స్టేడియం మొత్తం వర్షం ధాటికి అతలాకుతలం అయిపోయింది. తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రారంభమైన గాలివాన దెబ్బకు ఒక వైపు స్టాండ్ రూఫ్ మొత్తం కూలిపోవటంతో స్టేడియం మొత్తం చిత్తడి చిత్తడి గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఫలితంగా రెండో రోజు ఆట దాదాపు 7 గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. అదృష్టవశాత్తూ  రూఫ్  కూలిపోయిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఇక ప్రాణాపాయం తప్పింది అని చెప్పాలి.


 వర్షం ధాటికి  స్టేడియం ఎంత ధ్వంసమైంది అనే దానికి కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా ఒక వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన ఎంతోమంది షాక్ లో మునిగిపోతున్నారు అనే చెప్పాలి. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి బీభత్సం ఎప్పుడూ జరిగి ఉండదు అని చెప్పాలి. ఇక ఇది చూసిన తర్వాత శ్రీలంకపై అటు ప్రకృతి కూడా పగ పట్టినట్లుగా వ్యవహరిస్తుంది అని నెటిజన్లు  కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: