సాధారణంగా క్రికెటర్లకు సంబంధించిన పెళ్లి జరిగింది అంటే చాలా సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక క్రికెటర్ పెళ్లి అందరి కంటే మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రికెటర్ పెళ్లి మరింత స్పెషల్ గా మారడానికి ఒక కారణం కూడా ఉంది. ఆ కారణం గురించి తెలుసుకునే ముందు క్రికెటర్ ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ సీన్ అబాట్ గురించి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఇటీవల తన చిరకాల ప్రేయసి అయినా బ్రియర్ నీల్ ను ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. కేవలం కొంతమంది సన్నిహితుల మధ్య ఇక వీరి వివాహం జరిగింది అని చెప్పాలి.


 అయితే సీన్ అబాట్ బ్రియాన్ నీల్ తో ఎన్నో ఏళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇప్పటికే వీరికి ఒక చిన్నారి కూడా జన్మించింది అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేమలో మునిగి తేలి ఒక పాప పుట్టిన తర్వాత ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు ఇద్దరు. ఈ క్రమంలోనే  ఇటీవల జరిగిన పెళ్లి ఇక వారికి జన్మించిన చిన్నారి సమక్షంలోనే జరగడం గమనార్హం. దాదాపు ఎవరికి కూడా ఇలా జరగదు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో లని సీన్ అబాట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు.


 నా ప్రేమను నేను పెళ్లి చేసుకున్నాను.. నా బెస్ట్ ఫ్రెండ్ బ్రియాన్ ను.. స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో నా జీవితంలోకి ప్రత్యేక వేడుక ఇలా జరిగింది. అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ సన్రైజర్స్  హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాడు పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియాలో అబాట్ దంపతులకు సన్రైజర్స్ యజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. కాగా 2014లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అబాట్.

మరింత సమాచారం తెలుసుకోండి: