ఈ రోజు ఇంగ్లాండ్ మరియు ఇండియా జట్ల మధ్యన గత సంవత్సరం ఆగిపోయిన ఐదవ టెస్ట్ ఎడ్గబస్టన్ వేదికగా స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బుమ్రా కెప్టెన్సీ లో ఇండియా బ్యాటింగ్ మొదలెట్టింది. అయితే ఇండియా ఆటగాళ్లు శుభమాన్ గిల్ (17) , పుజారా (13) , విహారి (20), కోహ్లీ (11) మరియు శ్రేయాస్ అయ్యర్ (15) లు కొంచెం కుదురుకున్నట్టే అనిపించినా ఇంగ్లాండ్ కట్టు దిట్టమైన బౌలింగ్ కు వెను తిరగక తప్పలేదు. అలా ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం 98 పరుగులకే కుప్ప కూలిపోయింది. అయితే మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్న కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు.

ఈ దశలోనే పంత్ కెరీర్ లో పడవ అర్ద సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నేనున్నా అంటూ వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లకు అడ్డంగా నిలబడి పోయాడు. ఇతనికి అల్ రౌండర్ జడేజా నుండి చక్కని సహకారం లభించింది. సీనియర్లు విఫలమైన పిచ్ మీద పంత్ బ్యాటింగ్ చూసి అందరూ అవాక్కయ్యేలా కౌంటర్ అటాకింగ్ తో ఆడాడు. ఇంతకు ముందు స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో పేలవమైన ఆటతీరును కనబరిచిన పంత్ ఈ టెస్ట్ లో మాత్రం అద్భుతంగా ఆడాడు. పంత్ ఇదే జోరు కనుక చూపిస్తే మొదటి రోజే సెంచరీ చేసినా షాక్ అవ్వాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఇండియా 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. వీరిద్దరూ ఈ రోజు మొత్తం ఆడితే ఖచ్చితంగా పరుగులు చేస్తుంది. ఇక ఇండియాను ఆండర్సన్ 3 వికెట్లు, పాట్స్ రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టారు.  మరి ఆఖరి సెషన్ లో ఏ విధంగా ఆడుతారు అన్నది చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: