ప్రస్తుతం ఇంగ్లాండ్  స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ జో రూట్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం అతనిపై కెప్టెన్సీ భారం లేకపోవడంతో బ్యాట్స్ మెన్ గా ఎంతో స్వేచ్ఛగా ఆడుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే వరుస సెంచరీలతో కూడా చెలరేగి పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్ జట్టుతో ఇంగ్లాండ్ ఆడిన టెస్ట్ సిరీస్లో భాగంగా జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.


 న్యూజిలాండ్తో తొలి టెస్టు సందర్భంగా అజేయమైన సెంచరీ చేశాడు జో రూట్. అయితే అతనికి టెస్ట్ కెరీర్లో అది 26 వ సెంచరీ కావడం గమనార్హం. అదే సమయంలో అతను టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు   ఇక ఈ ఘనత ఇంగ్లండ్ క్రికెటర్ లో కేవలం కొంత మంది మాత్రమే సాధ్యమైంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ప్రస్తుతం టీమిండియాతో రీషెడ్యూల్ టెస్ట్ కు ముందు జో రూట్ కి ఒక అరుదైన బహుమతి లభించింది. ఏకంగా వెండి బ్యాట్ కానుకగా అందుకున్నాడు జో రూట్. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐసీసీ సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.


 ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో అతను తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు రెండో ఇన్నింగ్సులో 115 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు అనే. అంతేకాదు 10000 పరుగులు మార్క్ కూడా అందుకున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేయడంలో ఎంతో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా నిలిచాడు. ఈ క్రమంలోనే వెండి బ్యాట్ బహుమతిగా అందుకున్నాడు అనేది తెలుస్తుంది.. అయితే ఇటీవల న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన జో రూట్ ఇండియా ఆడబోయే టెస్టులో ఎలా రాణించ బోతున్నాడు అన్నది  ఆసక్తి కరం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bat