అతను భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ పేరు కారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరం అయిపోయాడు. ఇక ఆ తర్వాత టెస్టుల్లో కూడా సరిగా రాణించక పోవడంతో  మొన్నటి వరకు బిసిసీఐ అతని పక్కన పెట్టింది. కానీ తన ఫామ్ అందుకోవడానికి ఇంగ్లండ్ కౌంటీ లో ఆడి సెంచరీలతో చెలరేగిన పోయి మళ్లీ భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు భారతజట్టు ఇంగ్లాండు తో కీలకమైన టెస్టు మ్యాచ్ ఆడుతుండగా.. ఇందులో పుజారాదే ఎంతో కీలకమైన పాత్ర ఉంటుంది అని అందరూ అనుకున్నారు.

 కానీ భారత క్రికెట్ లో నయ వాల్ గా గుర్తింపు సంపాదించుకున్న పూజారా   పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారినపడి జట్టుకు దూరం కావడంతో ఓపెనర్ గా అవకాశం దక్కించుకున్నాడు పూజారా. ఇక అతనికి ఇంగ్లాండులో మంచి గణాంకాలు ఉండడంతో భారీ స్కోరు చేయడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో 2 ఫోర్లు తో 13 పరుగులు చేసి  చటేశ్వర్ పుజారా అండర్సన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి  వెనుదిరిగాడు.


 ఇక ఈ ఔట్ తో చటేశ్వర్ పుజారా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లోనే అత్యధిక సార్లు వికెట్ కోల్పోయిన బ్యాట్స్మెన్గా  పుజారా నిలిచాడు. ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ ఇప్పటి వరకు 12 సార్లు అండర్సన్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు.  ఇతని తరువాత పీటర్ పీడీల్ (11)డేవిడ్ వార్నర్ (10) ఉన్నారు. అయితే చటేశ్వర్ పుజారా మాత్రమే కాదు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మొత్తం విఫలమయ్యారు అని చెప్పాలి. ఆ లిస్టు చూసుకుంటే శుభ మాన్ గిల్ (17)  పుజారా (13), హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశపరచడంతో 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్( 146) రవీంద్ర జడేజా (88) పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

మరింత సమాచారం తెలుసుకోండి: