గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్ ఇక ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో భాగంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టులో తాను ఎంత కీలక ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. జట్టుకు తాను ఎంతో అవసరం అన్న విషయాన్ని తన ఆటతోనే చెప్పకనే చెప్పాడు రిషబ్ పంత్. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో చెలరేగిన పోయాడు. రవీంద్ర జడేజా తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ కారణంగానే తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది టీమిండియా. 107 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు రిషబ్ పంత్. ఇందులో 12 ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గమనార్హం. రవీంద్ర జడేజా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే పంత్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. 24 ఏళ్ళ 271 రోజుల వయసులో రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.. ఇక ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా భారత క్రికెట్ లో అరుదైన రికార్డు సాధించాడు. సచిన్ టెండుల్కర్ 25 ఏళ్లలో ఈ ఘనత సాధిస్తే.. సురేష్ రైనా 25 ఏళ్ల 77 రోజుల వయసులో 100 సిక్స్ లు పూర్తి చేసుకున్నాడు.


 కాగా తన 31వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్ 45 సిక్సర్లు కొట్టాడు..అదే సమయంలో 24 వన్డేల్లో ఇరవై నాలుగు సిక్సర్లు, 48 టి20 లలో 31 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు  సాధించిన 14వ భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ లిస్టులో రోహిత్ శర్మ అత్యధికంగా నాలుగు వందల అరవై నాలుగు సిక్సర్లతో మొదటిస్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. తర్వాత 352 సిక్సర్లతో మహేంద్రసింగ్ ధోని 264 సిక్సర్లతో సచిన్ టెండూల్కర్ ఈ లిస్టు లు వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఎవరూ కూడా 250 సిక్సర్లు  చేయలేకపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: