ఎవరూ ఊహించని విధంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకూ బౌలర్ గా ఎలా వికెట్ పడగొట్టాలి అన్నది మాత్రమే ఆలోచన చేసిన బుమ్రా ఇప్పుడు టీమ్ ఇండియా ను మొత్తం ఎలా ముందుకు నడిపించాలి అన్న దానిపై కూడా దృష్టి పెడుతున్నాడు. అయితే ప్రస్తుతం బూమ్రా కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్ చేసిన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగాఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే బూమ్రా కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటి వరకు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.



 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ గా వ్యవహరించడం అంత సులభమైన విషయమేమీ కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జస్ప్రిత్ బూమ్రా ఒకే సమయంలో బౌలింగ్ పై దృష్టి పెట్టడమే కాకుండా అదే సమయంలో ఫీల్డింగ్ కూడా సెట్ చేయాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎంతో బాధ్యతాయుతంగా శ్రద్ధతో తాను చేయాల్సింది తప్పకుండా చేసే వ్యక్తి బుమ్రా. ఇక మ్యాచ్ కొన సాగుతున్న తీరును అతడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా కెప్టెన్ కు కావాల్సిన అన్ని రకాల లక్షణాలు బుమ్రా లో ఉన్నాయి అంటూ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.


 కాగా ఇటీవలే బూమ్రా కెప్టెన్సీలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే  టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు  మొత్తం తక్కువ పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో చివరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ఇలాంటి సమయంలో రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ఎంతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: