ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో సీనియర్ పేసర్ బౌలర్ గా కొనసాగుతున్నాడు స్టువర్ట్ బ్రాడ్ . ఎన్నో ఏళ్ల నుంచి ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఎప్పుడూ తన ప్రతిభను చాటుతూ ఉంటాడు ఈ బౌలర్. ఇక స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఆ బ్యాట్స్మెన్లు కూడా ఆచితూచి ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి స్టువర్ట్ బ్రాడ్ కే ఏకంగా పీడకల లాంటి రోజును మిగిల్చాడు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.


 బౌలర్ గా బుమ్రా వికెట్లు పడగొట్టడం కొత్తేమీ కాదు కానీ బ్యాట్స్మెన్గా సిక్సర్లు ఫోర్లు కొట్టడం చాలా కొత్త అని చెప్పాలి. ఈ క్రమంలోనే బూమ్రా బ్యాటింగ్ చేస్తున్నాడు కదా పెద్దగా వైవిధ్యమైన బంతులు సంధించాల్సిన అవసరంలేదు అనుకున్నాడేమో లేక ఏం జరిగిందో తెలియదు కానీ  భారత్ బౌలర్ బుమ్రా వీరకొట్టుడు కొట్టాడు. ఒకే ఓవర్లో ఏకంగా 29 పరుగుల పరుగులు పిండుకున్నాడు జస్ప్రిత్ బూమ్రా. ఈ ఎక్స్ ట్రా ద్వారా ఆరు పరుగులు రావడంతో ఒకే ఓవర్లో 35 పరుగులు వచ్చాయి.


 దీంతో బూమ్రా ప్రపంచ రికార్డు కొడితే అటు సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా నిలిచాడు. ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్  అత్యంత చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2003లో దక్షిణాఫ్రికా బౌలర్లు ఆర్. పీటర్సన్ ఒకే ఓవర్లో 23 పరుగులు ఇచ్చారు. టెస్ట్ క్రికెట్ లో ఓకే ఓవర్ లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు స్టువర్ట్ బ్రాడ్ ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యంత చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు.  ఏదేమైనా జస్ప్రిత్ బూమ్రా సర్ప్రైస్ ఇన్నింగ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: