ఇటీవల ఇంగ్లాండ్లో భాగం గా టీమిండియా ఆడుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో భాగంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయిన టీమిండియాను గట్టెక్కించాడు రిషబ్ పంత్. క్రీజు లోకి వచ్చిన తర్వాత ఏకంగా టీ20 ఫార్మాట్ తరహాలో మెరుపు బ్యాటింగ్ తో అదర గొట్టాడు. అటు ఇంగ్లాండ్ బౌలర్లపై చెడుగుడు ఆడాడు. సిక్సర్లు  ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ క్రమం లో 111 బంతుల్లోనే 146 పరుగులు సాధించి తిరుగు లేదు అని నిరూపించాడు రిషబ్ పంత్.


 ఒకవేళ రిషబ్ పంత్ ఇలాంటి కీలకమైన ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే అటు ఇండియా గౌరవ ప్రదమైన స్కోరు చేయలేక పోయేది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఈ క్రమం లోనే రిషబ్ పంత్ పై అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల స్పందించిన ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  రిషబ్ పంత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. రిషబ్ పంత్ లాంటి  ఉత్సాహవంతమైన ఆటగాళ్లను చూస్తూ ఉంటే ఆటోమేటిక్ చప్పట్లు కొట్టాలి అని అనిపిస్తుంది అంటూ మనసులో మాట బయట పెట్టాడు.


 ఇక రిషబ్ పంత్ కీలక సమయం లో ఆడిన విధానం ఎంతో అమోఘం.. ఇక రిషబ్ పంత్ ఇలాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లకు ప్రత్యర్థులుగా ఆడటం ఎంతో ఆనందం గా ఉంది. అప్పుడే ప్రపంచ స్థాయి ప్రదర్శనలు మనం చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక టెస్ట్ క్రికెట్ కు సంబంధించి ఇది మరో ఉత్తేజ కరమైన రోజు చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్వుడ్. ఇంగ్లాండ్ జట్టుకు కోచ్గా బ్రెండన్ మెకల్లమ్   వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్లో వైవిధ్యాన్ని చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమ బౌలింగ్ విభాగం కూడా బాగా రాణించింది అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: