భారత క్రికెట్ పై.. భారత ఆటగాళ్ల పై ఎప్పుడూ ఇంగ్లీష్ క్రికెటర్లు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదా చిన్నచూపు చూడటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇలా భారత క్రికెటర్లను తక్కువ చేసి మాట్లాడటం లాంటివి తగ్గినప్పటికీ అక్కడక్కడా మాత్రమే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఇటీవలే ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో భాగంగా భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మొత్తం కుప్పకూలిపోయారు. 99 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది భారత జట్టు.


 అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 146 పరుగులు చేసి అదరగొట్టాడు రిషబ్ పంత్. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగానే అటు టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది అని చెప్పాలి. ఇక మరో ఎండ్ లో ఉన్న రవీంద్ర జడేజా సైతం 104 పరుగులతో సెంచరీ చేసి అదరగొట్టాడు. అయితే 146 పరుగులు వద్ద ఇంగ్లాండ్ టెస్ట్ మాజీ కెప్టెన్ జో రూట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు మ్యాచ్ హైలెట్స్  ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యూట్యూబ్ లో పెట్టింది. దీనికి ఇంగ్లాండ్ జట్టును పొగుడుతూ రాసుకొచ్చింది.


 పంత్ పాడిన అద్భుతమైన ఇన్నింగ్స్ వదిలేసి అతన్ని  అవుట్ చేసిన జో రూట్ అంటూ టైటిల్ ఇచ్చింది. అయితే  ఈ విషయంపై స్పందించిన దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టొచ్చు కానీ ఇరు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత ఇంగ్లాండ్ బోర్డుకు ఇంతకంటే మంచి టైటిల్ ఆలోచన రాలేదేమో  అంటూ కౌంటర్ ఇచ్చాడు దినేష్ కార్తీక్. సాధారణంగా అయితే  ఇన్నింగ్స్ లో ఎవరు మంచి ప్రదర్శన చేస్తారో వారి పేరునే టైటిల్గా పెడతారు. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం అలా చేయకపోవడంతో దినేష్ కార్తిక్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: