హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం కీలక బౌలర్ గా కొనసాగుతుండడం విశేషం జరుగుతుంది. అద్భుతమైన బౌలింగ్తో వికెట్లు పడగొడుతున్నాడు. తక్కువ సమయం  లోనే స్టార్ బౌలర్ గా ఎదిగాడు మొహమ్మద్ సిరాజ్.. ఇటీవల ఇంగ్లాండ్లో జరుగుతున్న చివరి టెస్టులో కూడా అదర గొట్టాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య  ఇంగ్లాండ్ జట్టు పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియా భారత బౌలర్లు అద్భుతంగా రాణించడం తో చివరికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేయలేక చతికిల పడ్డాడు అని చెప్పాలి.



 అయితే ఇండియాకు ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న జస్ప్రిత్ బుమ్రా మూడు వికెట్లకు అదర గొట్టాడు అనే విషయం తెలిసిందే. అదే సమయం లో సిరాజ్  కూడా తనదైన బౌలింగ్ తో అదర గొట్టాడు. కీలక మైన మాజీ కెప్టెన్ జో్ రూట్ వికెట్ తీసి  టీమిండియాకు విజయం వరించడం మరింత సులభతరం చేశాడు అని చెప్పాలి. టీమిండియా బౌలర్లు విజృంభించడం తో 5 వికెట్లకు 84 పరుగులు మాత్రమే ఇంగ్లండ్ జట్టు పరిమితం అయ్యింది. అయితే సూపర్ ఫామ్లో ఉన్న జో రూట్ సిరాజ్ వేసిన బంతిని ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు.


  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయం  లో 23వ ఓవర్ వేయడానికి వచ్చాడు సిరాజ్. ఓవర్ లో ఆఖరి బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాడు జో రూట్. మహమ్మద్ సిరాజ్ షార్ట్ పిచ్ బంతి వేయగా జో రూట్ బౌన్సర్ అనుకున్నాడు.  జో రూట్ కన్ఫ్యూజన్ లోనే బంతిని టచ్ చేశాడు.  చివరికి బంతి బ్యాట్ ఏడ్జ్  తీసుకుంటూ కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో టీమిండియా సంబరాల్లో మునిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: