సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు అందరూ కూడా ఎంతో అగ్రెసివ్ గానే ఉంటారు. ఈ క్రమంలోనే ఏ పొరపాటు జరిగినా కూడా అసలు సహించరు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక ప్రత్యర్థి ఆటగాళ్లతో కొన్ని కొన్ని సార్లు గొడవ పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఇప్పటివరకు ఎన్నో క్రికెట్ మ్యాచ్ లలో అటు ఇరు జట్ల ఆటగాళ్లు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ఇలాంటి మాటల యుద్ధం జరిగితే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా  భారత్ ప్రతిష్ఠాత్మకమైన ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతుంది.


  ఈ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ మాటల యుద్ధం తర్వాత ఏకంగా బెయిర్ స్టో కోపంతో సెంచరీ చేసి చెలరేగి పోయాడు అని చెప్పాలి. ఇక ఈ వివాదం గురించి ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. అయితే తాజాగా కోహ్లీతో జరిగిన గొడవ గురించి బెయిర్ స్టో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 పదేళ్ల నుంచి కోహ్లీ నేను ప్రత్యర్థులుగా క్రికెట్ ఆడుతూన్నాము.  గ్రౌండ్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం సర్వసాధారణం. అయితే ఏం జరిగినా సొంత జట్టును  పోటీలో ఉంచాలి అనుకుంటాము. మైదానం లో గొడవలు కూడా గేమ్ లో భాగమే. మైదానంలో ఎన్నో యుద్ధాలు జరిగినా మ్యాచ్ ముగిసిన తర్వాత.. మేము ఇద్దరం కలిసి ఒకే చోట డిన్నర్ చేస్తాం. ఇటీవలే కోహ్లీతో జరిగిన గొడవ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ బెయిర్ స్టో స్పందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: