ప్రస్తుతం బ్రేకుల్లేని బండి లాగా బుమ్రా దూసుకుపోతున్నాడు. మొన్నటి వరకు కేవలం బంతితో మాత్రమే మాయ చేసిన బుమ్రా ఇక ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్నాడు. కెప్టెన్సీ  చేపట్టిన తర్వాత జస్ప్రిత్ బూమ్రా కొత్త జోరులో కనిపిస్తున్నాడు అని చెప్పాలి.  ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేపట్టిన అనుభవం లేని జస్ప్రిత్ బుమ్రా సారథ్య బాధ్యతలు నిర్వహిస్థాడ అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఊహించని విధంగా కెప్టెన్ అనే పదానికి తనప్రతిభతో పూర్తి న్యాయం చేస్తున్నాడు జస్ప్రిత్ బూమ్రా. ఇక  ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్ టెస్ట్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో ఒకే ఓవర్ లో 29 పరుగులు చేసిన అందర్నీ ఆశ్చర్య పరిచాడు.


 ఆ తర్వాత బౌలింగ్ కూడా అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మూడు వికెట్లు తీసుకున్నాడు బుమ్రా. ఇలా టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. ఒక రకంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బుమ్రా అటు బౌలింగ్ లో మాత్రం ఇరగదీసాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు ఎంతో దూకుడుగా ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ దూకుడుకు బ్రేక్ వేసాడు.


 46 పరుగుల వద్ద ఓపెనర్ క్రాలేని బుమ్రా ఔట్ చేశాడు. దీంతో టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో వంద వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్లు  ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా  కూడా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతూ ఉండడం గమనార్హం. క్రాలే వికెట్ తోపాటు పోఫ్ వికెట్ కూడా తీసుకున్నాడు అని చెప్పాలి . ఏదేమైనా బుమ్రా ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులు అందరూ కూడా  ఆనందంతో ఎగిరి గంతు వేయకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: