మొన్నటికి మొన్న పురుషుల హాకీ ప్రపంచ కప్ జరిగింది అన్న విషయం తెలిసిందే . పురుషుల హాకీ ప్రపంచ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు అటు తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. లీగ్ దశ నుంచే అటు టీమిండియా పురుషుల హాకీ ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది అనే విషయం తెలిసిందే. ఎంతో మంది భారత అభిమానులు నిరాశ లో మునిగిపోయారు. అయితే ఇక ఇప్పుడు మహిళల హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది. ప్రస్తుతం మహిళల హాకీ భారత జట్టు అయినా సరే  టోర్నీ గెలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.


 ఈ క్రమంలోనే ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ లను మిస్ కాకుండా చూస్తున్నారు అని చెప్పాలి. కాగా మహిళల హాకీ ప్రపంచ కప్ లో భాగంగా నేడు ఒక కీలకమైన పోరు జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఇక ఇటీవల  ఈ ప్రపంచ కప్లో భాగంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడింది భారత మహిళల హాకీ జట్టు. అయితే ఒకానొక దశలో ఈ మ్యాచ్లో  భారత జట్టు విజయం సాధించేలాగా కనిపించింది. కానీ ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా పుంజుకోవడంతో చివరికి తొలి మ్యాచ్ ను డ్రాగా ముగించింది టీమిండియా. ఇక నేడు చైనాతో మ్యాచ్ ఆడబోతుంది అన్నది తెలుస్తుంది.



 కాగా భారత్-చైనా మధ్య మ్యాచ్ అటు రాత్రి 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు అని చెప్పాలి. అయితే చివరిసారిగా హాకీ ప్రో లీగ్లో భాగంగా చైనాతో రెండు మ్యాచ్లు ఆడింది భారత మహిళల హాకీ జట్టు. ఇక రెండింట్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి చైనాపై పూర్తి ఆధిపత్యం సాధించి విజయం అందుకుంది. ఇక అదే ఆత్మవిశ్వాసంతో నేడు మహిళల హాకీ ప్రపంచ కప్ లో కూడా బరిలోకి దిగబోతోంది అన్నది తెలుస్తోంది. ఇక చైనాతో జరిగే మ్యాచ్లో విజయం సాధించి ఇక వరల్డ్ కప్ లో భోని కొట్టాలని భావిస్తోంది టీమిండియా జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: