ఇటీవల ఎవరూ ఊహించని విధంగా టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన జస్ప్రిత్ బూమ్రా తన ఆటతీరుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల బ్యాటింగ్ లో సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి ఒకే ఓవర్లో 29 పరుగులు చేశాడు. దీంతో కేవలం దిగ్గజ బ్యాట్స్మెన్ లకు మాత్రమే సాధ్యమైన ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు  బౌలర్ జస్ప్రిత్ బూమ్రా. అయితే అటు బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్ లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వరుసగా వికెట్లు పడగొడుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇటీవలే కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాను విజయ తీరాల వైపు నడిపించడంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా బుమ్రా రికార్డు సొంతం చేసుకున్న జస్ప్రీత్ బుమ్రా.. ఇటీవలే భారత దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఇప్పుడు వరకు ఏకంగా ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు జస్ప్రిత్ బూమ్రా. ఇంగ్లాండ్ పై జరిగిన టెస్ట్ లో ఒకే సిరీస్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత పేసర్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1981- 82 ఇంగ్లాండ్ సిరీస్ లో కపిల్ దేవ్ ఇంగ్లాండ్పై 22 వికెట్లు తీసాడు. అయితే ఇప్పుడు బుమ్రా  ఈ రికార్డును బ్రేక్ చేశాడు అని తెలుస్తోంది.


 ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఒక్క రోజులో అంత ఉల్టా పల్టా అయిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటివరకు మ్యాచ్ భారత్ వైపు ఉంది. టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం ఖాయం అని అందరూ భావించారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు పుంజుకుంది. ఈ క్రమంలోనే భారత్కు గట్టిపోటీ ఇవ్వడమే కాదు టెస్టు మ్యాచ్లో విజయం సాధించేలా గా కనిపిస్తూ ఉంది. నాలుగో రోజు ఆటలో భాగంగా మూడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది ఇంగ్లండ్ జట్టు. ఇప్పుడు 90 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే కావాలి. ఇది పెద్ద కష్టమైన టార్గెట్ కాదు అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: