ఇటీవల ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ జస్ప్రిత్ బూమ్రా కు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి అందరిని ఆశ్చర్యపరిచింది అనే విషయం తెలిసిందే. భారత జట్టులో ఎంతో మంది సీనియర్ ఆల్రౌండర్లు, బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ అటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్  బుమ్రా కు కెప్టెన్సీ అప్పగించడంతో ఇప్పటికి దీని గురించి  కూడా చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు ఇయాన్ చాపెల్.


 టెస్ట్ జట్టు కెప్టెన్గా జస్ప్రిత్ బూమ్రా రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  పాట్ కమ్మిన్స్, బెన్ స్టోక్స్ లాంటి వారి సక్సెస్ అవ్వడం చూస్తూ ఇక ఇప్పుడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ టెస్ట్ కు సారథిగా నియమించింది బీసీసీఐ. నిజానికి అయితే ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఇక బుమ్రా సమర్ధత ఏంటి అన్న విషయం ఈ ఒక్క విషయం తో అర్థం చేసుకోవచ్చు అంటూ ఇయాన్ ఛాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతే కాకుండా ఇక ఫాస్ట్ బౌలర్లు అయినప్పటికీ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ను ఇక ఆస్ట్రేలియాను ప్యాట్ కమ్మిన్స్ ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు అంటూ ప్రశంసించారు ఇయాన్ ఛాపెల్. అయితే బుమ్రా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడని చెప్పాలి.


 మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా బ్యాటింగ్కు వచ్చిన జస్ప్రిత్ బూమ్రా ఏకంగా ఒకే ఓవర్లో 29 పరుగులు చేసి ఆశ్చర్య పరిచాడు. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును కూడా కొల్లగొట్టాడు. ఇక ఆ తర్వాత కూడా అద్భుతంగా రాణించాడు అనే చెప్పాలి. వరుసగా మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బూమ్రా ఇక అటు ఇంగ్లాండ్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. ఇలా జస్ప్రిత్ బూమ్రా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే జస్ప్రిత్ బూమ్రా ప్రదర్శనపై ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: