ఇటీవలే ఇంగ్లాండ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ లో అటు ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే 2-2 తేడాతో సిరీస్ ఆరంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కి చేదు అనుభవం ఎదురైంది. గత మ్యాచ్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ చేసిన సమయంలో బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్లో మూడో రోజు ఆట లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా స్టువర్ట్ బ్రాడ్ కి చేదు అనుభవం ఎదురైంది అని తెలుస్తుంది.



 ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో భాగంగా తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు స్టువర్ట్ బ్రాడ్. ఈ క్రమంలోనే మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ లు మొత్తం షార్ట్ డెలివరీ లో తెగ ఇబ్బంది పెట్టారు అని చెప్పాలి. దీంతో ఈ విషయాన్ని  స్టువర్ట్ బ్రాడ్ అంపైర్కు పదేపదే ఫిర్యాదు చేస్తూ వచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ తీరుతో అంపైర్లు కూడా సహనం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. నన్ను అంపైరింగ్ చేసుకోనీవ్వు.. నువ్వు బ్యాటింగ్ చెయ్.. ఓకే.. లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావ్ అంటూ ఏకంగా స్టువర్ట్ బ్రాడ్ ని హెచ్చరించాడు అంపైర్.



 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే తొలి ఇన్నింగ్స్ సమయంలో 5 బంతులు ఎదుర్కొనీ ఒకే ఒక పరుగు తీసి సిరాజ్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. అయితే మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యంలో కొనసాగగా ఇక నాలుగో రోజు పట్టుబిగించిన ఇంగ్లాండ్ జట్టు చివరికి విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో చారిత్రాత్మక విజయం సాధించి చరిత్ర సృష్టించారు అనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది. టీమిండియా ఓటమి తో అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: