సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు చేసే చిన్న పొరపాట్లు ఊహించని ఫలితాలను ఇస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. కేవలం క్రీడాకారులు  మాత్రమే కాదు కొన్నిసార్లు రిఫరీలు  చేసే పని తప్పిదాలు కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు విషయంలో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్  ఛాంపియన్షిప్ లో భాగంగా సింగిల్స్ సెమీఫైనల్ లో ఒక వివాదం తెరమీదికి వచ్చింది. యమగుచి చేతిలో సింధు ఓటమి పాలు అయి కాంస్య పతకంతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే.


 అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ఇక రిఫరీ  తీసుకున్న తప్పుడు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దీంతో అది వివాదంగా మారింది. సింధు రెండో గేమ్ లో 14 -11 పాయింట్లతో  ఆధిక్యాన్ని కొనసాగిస్తూ  దూసుకుపోయింది. ఇలాంటి సమయంలో మ్యాచ్ రిఫరీ యమగుచికి ఒక పాయింట్ కేటాయించాడు. సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకున్నందుకు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. యమగూచి సిద్ధంగా లేదని.. అందుకే తాను సర్వీస్  చేసేందుకు సమయం తీసుకున్నాను అంటూ సింధు ఎంత చెప్పినా రిఫరీ పట్టించుకోలేదు. ఆ తర్వాత మ్యాచ్ పై పట్టు సాధించిన యమగుచి 21-19  తేడాతో విజయం సాధించింది.


 ఇకపోతే ఈ వివాదంపై బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ స్వయంగా స్పందించారు. మ్యాచ్ లో మానవ తప్పిదానికి సింధూ క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కి బ్యాట్మెంటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ ఒక ప్రత్యేకమైన లేఖ రాశారు అన్నది తెలుస్తుంది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. దురదృష్టవశాత్తు ఇప్పుడు పొరపాటును సరిదిద్దే అవకాశం లేదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాము. ఇది ఆటలో భాగమే అంగీకరిస్తారని విశ్వసిస్తున్నాము అంటూ లేఖలో పేర్కొన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: