గత కొంత కాలం నుంచి భారత క్రికెట్లో ఎప్పుడూ ఎవరికీ అవకాశం దక్కుతుంది  అన్నది ఊహించని విధంగా ఉంది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు భారత జట్టుకు దూరమైన ఆటగాళ్లు కూడా ఇక తక్కువ సమయంలోనే ఏకంగా భారత జట్టులో కీలక బాధ్యతలు చేపడుతున్న పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా గత కొంత కాలం నుంచి భారత జట్టుకు ఎంతో మంది సారథులు మారుతూ వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు విరాట్ కోహ్లీ మాత్రమే అన్ని ఫార్మాట్లకు సారథిగా కొనసాగుతూ వచ్చేవాడు. ఇప్పుడు రోహిత్ శర్మ సారధిగా చేపట్టిన తర్వాత ఒక్కో సిరీస్కి ఒక్కో కెప్టెన్ తెరమీదికి వస్తున్నాడు.


 మొన్నటికి మొన్న భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా జట్టుతో టీ20 సిరీస్ లో భాగంగా కెప్టెన్ గా ఎంపికైన కె.ఎల్.రాహుల్ గజ్జల్లో గాయం కారణంగా దూరం కావడంతో పంత్ కెప్టెన్సీ చేపట్టాడు. ఇక ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు అటు ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా కొత్త కెప్టెన్ భారత్ జట్టు బాధ్యతలు చేపట్టాడు. అతను ఎవరో కాదు వెటరన్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్. భారత జట్టులో పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో గత కొంత కాలం నుంచి శిఖర్ ధావన్ కు సరైన అవకాశాలు దక్కడం లేదు.


 ఈ క్రమంలోనే జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్ తో భారత జట్టు ఆడబోయే వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన వివరాలను ప్రకటించింది బిసిసిఐ. ఈ క్రమంలోనే వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను సెలక్టర్లు సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేశారని తెలుస్తోంది. రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కే ఛాన్సుంది. ఐర్లాండ్  పర్యటనలో అదరగొట్టిన దీపక్ హుడా కు టి20 సిరీస్ లో అవకాశం దక్కింది. ఇలా మొన్నటి వరకు  టీమిండియాలో చోటు దొరకడం కష్టంగా ఉన్న ఆటగాడిగా ధావన్ ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్ గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: