మనం ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటాం . తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులు ఆ తర్వాత మంచి చదువులు చదివి టీచర్ లాగా మారిపోయి వస్తూ ఉంటారు.  కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం అదే తరగతిలో ఇంకా చదువుతూనే ఉండటం చూస్తూ ఉంటాము. మరికొంతమంది వివిధ వృత్తుల్లో కొనసాగుతూ అప్పుడప్పుడు ఎదురు పడటం లాంటి జరుగుతూ ఉంటారు   కానీ ఇటీవల ఇంగ్లాండ్  తో టీం ఇండియా ఆడిన టి20 మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది అనేది తెలుస్తుంది. టి20 మ్యాచ్ లో భాగంగా ఫీల్డ్ అంపైర్ వ్యవహరించిన అలెక్స్ వార్ఫ్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్ ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది.


 2004 లో మొదటి టి20 మ్యాచ్ ఆడిన దినేష్ కార్తీక్ తో కలిసి ప్రత్యర్థి జట్టులో ప్లేయర్గా కొనసాగాడు అలెక్స్ వార్ఫ్. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో మాత్రం ఫీల్డ్ అంపైర్ గా  వ్యవహరించిన అలెక్స వార్ఫ్  టీమిండియాపై  లార్డ్స్ లో  ఇంగ్లండ్ తరపున మూడో వన్డే ఆడాడు. అదే మ్యాచ్ లో దినేష్ కార్తీక్  ఒకే ఒక పరుగు చేసి బీటెక్ కోల్పోయాడు.. ఇక వికెట్ కీపింగ్ లో పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాడు.  అయితే అప్పుడు దినేష్ కార్తీక్ ప్రత్యర్థిగా ఉన్న అలెక్స్ వార్ఫ్ 221 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 293 వికెట్లు తీశాడు. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.  2011లో ఫీల్డ్ అంపైర్ మారిపోయాడు అలెక్స్ వార్ఫ్.  దినేష్ కార్తీక్ మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతూ ఉన్నాడు.


 మొన్నటి వరకు టీమిండియాకు దూరంగా ఉన్న దినేష్ కార్తీక్ ఇటీవల ఐపీఎల్లో ప్రదర్శన కారణంగా టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే.  అంతకుముందు కామెంటేటర్ గా కూడా దినేష్ కార్తీక్ పనిచేశాడు. ఇలా తోటి ఆటగాడు అయినప్పటికీ దినేష్ కార్తీక్ ఇంకా ప్లేయర్ గా కొనసాగుతూ ఉంటే.. అలెక్స్ వార్ఫ్ మాత్రం దినేష్ కార్తీక్ ప్లేయర్ గా ఉన్న మ్యాచ్ కి అటు ఫీల్డ్ అంపైర్ గా వ్యవహరించాడు అన్నది తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: