మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగాడు విరాట్ కోహ్లీ.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతూ వచ్చాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన చేస్తూ జట్టుకు విజయాలను అందిస్తూ ఉండేవాడు.  ఒక కెప్టెన్గా కూడా అటు కోహ్లీ ఎన్ని అద్వితీయమైన విజయాలు అందించి  భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా అటు బౌలర్లకు కోహ్లీ సింహస్వప్నంలా ఉండేవాడు అని చెప్పడంలోను అతిశయోక్తి లేదు.


 అలాంటి విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు కెరీర్లో ఎప్పుడూ చూడనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి సరైన ఫామ్ లో లేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఒకప్పుడు వరుస సెంచరీలు కొట్టిన కోహ్లీ ఇక ఇప్పుడు సెంచరీ చేయగా మూడేళ్లు గడిచిపోతున్నాయి. బీసీసీఐ అతనికి ఎంతలా అవకాశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ మునుపటి ఫామ్ అందుకోలేక పోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా కోహ్లీ పేలవ ఫామ్ పై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ మరో మూడు నెలలపాటు క్రికెట్ నుంచి విరామం తీసుకుంటే మంచిది అంటూ మైకెల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల కెరీర్లో కుటుంబంతో మిస్సయిన అనుభూతులను ఆస్వాదించాలని.. బీచ్ ల వద్ద హాయిగా సేద తీరాలి అంటూ సూచించాడు. స్వల్ప వ్యవధిలో మూడు ఫార్మాట్లకు ఆడటం ఏ ఆటగాడైనా అసాధ్యం అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున ఆడుతున్న కోహ్లీ వెస్టిండీస్ పర్యటనకు మాత్రం సెలెక్టర్ లను విశ్రాంతి కావాలని కోరినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: