గత కొంత కాలం నుంచి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు . వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక అచ్చం ఇలాగే జట్టులో స్థానం సంపాదించుకున్న దీపక్ హుడా తన బ్యాటింగ్తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అనే చెప్పాలి. మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడిన దీపక్ హుడా జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో మెస్మరైజ్ చేశాడు.


 దీంతో సెలక్టర్ల దృష్టిలో పడి టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఆడిన టి20 మ్యాచ్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దీపక్ హుడా. అటు ఐర్లాండ్ పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఐర్లాండ్  పర్యటనలో భాగంగా ఏకంగా టి20లో సెంచరీలు చేసి అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతున్న టి20 టీమిండియా జట్టులో కూడా దీపక్ హుడా ఉన్నాడు అని చెప్పాలి. మొదటి 20 మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 17 బంతుల్లో 33 పరుగులు చేశాడు.


 అయితే ఇక ప్రతి మ్యాచ్లో కూడా కోహ్లీ లేని లోటును తీరుస్తున్నాడు. మూడవ స్థానంలో బరిలోకి దిగుతూ  బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా యువ బ్యాట్స్మెన్ దీపక్ హుడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు అతడు ఫామ్ లోకి రావడం కోహ్లీపై ఒత్తిడి పెంచుతుంది అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్. మొదటి టి20 లో 17 బంతుల్లో 33 పరుగులు.. మొన్నటికి మొన్న ఓ టి 20 మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలోనే కోహ్లీ స్థానానికి దీపక్ హుడా నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడింది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: