ప్రస్తుతం భారత క్రికెట్ లో కీలక ఆటగాళ్లు ఎవరు అంటే అందరూ చెప్పే పేరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అని. ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టీమిండియాను ముందుకు నడిపిస్తే వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు రోహిత్ శర్మ. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఎన్నోసార్లు టీమిండియాకు విజయాన్ని అందించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు రోహిత్ శర్మ. ఏది ఏమైనా ఇక ఇద్దరు ఆడుతుంటే మాత్రం చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పాలి.


 భారీ పరుగులు సాధించడం లోనైనా.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టడం లోనైన ఇద్దరూ ఎవరికి వారే సాటి. ఒకరిని ప్రేక్షకులు ఎంతో ముద్దుగా హట్ మ్యాన్ అని పిలుచుకుంటూ ఉంటే.. మరొకరిని అభిమానులు పరుగుల యంత్రం అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక అభిమానులు ఎలా పిలిచిన ఇద్దరూ మాత్రం అటు టీమిండియా కోసం ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లను ప్రస్తుతం ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది అన్నది తెలుస్తుంది. నేడు ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీ20 మ్యాచ్ లో ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.


 వీరిద్దరూ చెరో రెండు బౌండరీలు బాదారూ అంటే చాలు టి20 ఫార్మాట్లో మూడు వందల ఫోర్ల  మైలురాయిని అందుకుంటారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో సమానంగా 298 బౌండరీలు ఉన్నాయి అని చెప్పాలి. కాగా పొట్టి ఫార్మాట్లోనూ 300 బౌండరీలు సాధించిన రికార్డు ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్   పేరిట ఉంది. స్టిర్లింగ్ 104 టి20 ఇన్నింగ్స్ లలో 325 బౌండరీలు బాదాడు. ఇప్పటివరకు ఎవరూ కూడా ఈ రికార్డులకు చేరువ కాలేదు అని చెప్పాలి. ఇప్పుడు ఈ రికార్డ్ పై కన్నేసారూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. కాగా మొదటి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. ఇక నేడు రెండో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: