గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కొనసాగుతుండగా.. మాజీ క్రికెటర్లు అతని పై విమర్శలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఇటీవలే స్పందించిన భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకప్పటి కోహ్లీలా అతను లేడని.. పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు టీమిండియాలో అవకాశం కోసం ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని.. పేరున్న క్రికెటర్ అనే కారణంతో విరాట్ కోహ్లీని కొనసాగించడం  ఆమోదయోగ్యం కాదు అంటూ వ్యాఖ్యానించాడు.


 రవిచంద్రన్ అశ్విన్ ను టీం ఇండియా నుంచి పక్కన పెట్టినప్పుడు ఇక విరాట్ కోహ్లీని ఎందుకు పక్కన పెట్టడం లేదు అంటూ ప్రశ్నించాడు. దీంతో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఇటీవల జరిగిన 3వ టి20 మ్యాచ్ లో కూడా అటు విరాట్ కోహ్లీ మరోసారి పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో మొదటి సారి విరాట్ కోహ్లీ పేలవమైన ఫాంపై స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే కోహ్లీకి మద్దతుగా నిలబడటమే కాదు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కి కౌంటర్ ఇచ్చాడు.


 టి-20 ఫార్మెట్లోనూ టార్గెట్ చేదించడం లో ఎలా ఆడాలో కోహ్లీ అలాగే ఆడాడు. భారీ టార్గెట్ ను అందుకునే క్రమంలో కోహ్లీ తన బ్యాటింగ్ పట్ల సంతోషం గానే ఉన్నాడు అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీని పక్కన పెట్టాలన్న కపిల్ దేవ్ వ్యాఖ్యలపై కూడా స్పందించాడు రోహిత్ శర్మ. జట్టులో మేము ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నామో ఆయనకేం తెలుసు.. మా వ్యూహాలు ప్రణాళికలు మాకు ఉంటాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రోహిత్ శర్మ. ఇటీవల రోహిత్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: