ఇటీవలే దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్  క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక మహిళల టీమ్ ఇండియా జట్టు హర్మన్ ప్రీత్ కౌర్  కెప్టెన్గా ఎంపిక అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించే అవకాశం దక్కించుకుంది. జులై 28వ తేదీ నుంచి బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయ్ అనే విషయం తెలిసిందే. అయితే కామన్వెల్త్ క్యాలెండర్ లో మహిళల టి20 క్రికెట్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఇంత కంటే ముందు 1998లో జరిగిన కౌలాలంపూర్ కామన్ వెల్త్ గేమ్స్ లో పురుషుల వన్డే టోర్నమెంట్ జరిగింది.


 టి20 ఫార్మాట్ లో అండర్ -100 స్ట్రైక్ రేట్ ఉన్న వికెట్ కీపర్ సానియా భాటియా ఈ గేమ్స్ లో  దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డాషింగ్ బ్యాటర్  రీఛా ఘోష్ స్టాండ్ బైగా ఉండబోతుందట ఇక గాయం కారణంగా శ్రీలంక సిరీస్కు దూరమైన స్నేహ రానా జాతీయ జట్టుతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాగా ప్రస్తుతం ఆమెను నేషనల్ క్రికెట్ అకాడమీ పంపినట్లు తెలుస్తోంది. ఇక కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్తాన్ తో పాటు భారత జట్టు గ్రూప్- ఏ లో ఉండనున్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్,న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా గ్రూప్ బి లో పాల్గొంటాయి. జులై 29న ఆస్ట్రేలియా భారత్ మధ్య మొదటి మ్యాచ్ జరగబోతోంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ మెగా ఈవెంట్ లో అటు భారత మహిళల జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అన్నది  ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. మెరుగైన ప్రదర్శన చేసి కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పథకాన్ని సాధించాలని భారత మహిళల జట్టు ఎంతో పట్టుదలతో ఉంది అని చెప్పాలి. ఇటీవలే శ్రీలంకలో పర్యటించే భారత మహిళల జట్టు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టుపై 3-0 తేడాతో గెలిచింది. అంతకుముందు టి20 సిరీస్ లో కూడా విజయం సాధించింది.

 ఇక కామన్వెల్త్ గేమ్స్ ఆడబోయే మహిళల జట్టు వివరాలు ఇలా ఉన్నాయి :
హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా (Wk), యాస్తికా భాటియా (Wk), దీప్తి శర్మ , రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ , మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్ , రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రానా.

మరింత సమాచారం తెలుసుకోండి: