ఇప్పటికే టి20 సిరీస్ లో 1 మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుని ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చిన టీమిండియా.. వన్డే  సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓవల్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది టీమిండియా. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది.  ఈ క్రమంలోనే స్టార్ బ్యాట్స్ మెన్ లు ఉన్న ఇంగ్లండ్ జట్టును కేవలం 111 పరుగులకే  ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా ఎంతో సాఫీగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి.



 అయితే మొన్నటి వరకు తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకున్న రోహిత్ శర్మ ఇక ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లు ఫోర్లుతో చెలరేగిపోయాడు అ
ని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా రోహిత్ శర్మ కొట్టిన ఒక పవర్ఫుల్ సిక్సర్ మైదానంలో మ్యాచ్ వీక్షిస్తున్న చిన్నారికి గాయం అయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో డేవిడ్ ఢిల్లీ వేసిన ఓ బంతిని ఫుల్ షాట్ ఆడాడు కెప్టెన్ రోహిత్ శర్మ.


 ఇక బంతి ఎంత వేగంగా వెళ్లి స్టేడియంలో మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఒక పాప కు తగిలింది. దీంతో ఆ పాప నొప్పిని తట్టుకోలేక విలవిలలాడి పోయింది. ఈ క్రమంలోనే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ ఈ విషయాన్ని తన సహచరులకు చెప్పాడు. ఇక హిట్ మాన్ దగ్గరికి వచ్చిన బెయిర్ స్టో పాపకు గాయం అయింది అన్న విషయాన్ని తెలిపాడు. ఈ క్రమంలోనే సదరు పాప రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశాడు.. కొద్దిసేపు మ్యాచ్ ని ఆపి ఇంగ్లాండ్ ఫిజియో లు  పాప దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి ప్రథమ చికిత్స చేశారు.  పాప పేరు మీరా సాల్వే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: