గత ఏడాది ఐపిఎల్ వరకు కూడా హార్థిక్ పాండ్య అంటే ఒక స్టార్ ఆల్రౌండర్ అన్న పేరు మాత్రమే ఉండేది. కానీ ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ మాత్రం ఊహించని రీతిలో క్రేజ్ తెచ్చిపెట్టింది అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్  జట్టుఅతన్ని సొంతం చేసుకుంది. అంతేకాదండోయ్ ఏకంగా సారథ్య బాధ్యతలను కూడా అతని చేతిలో పెట్టేసింది. అప్పటివరకు గాయాల బారినపడి టీమిండియాకు దూరమై గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. అసలు రాణిస్తాడో లేదో అనుకుంటున్న సమయంలో అతని చేతిలో సారథ్య బాధ్యతలు పెడితే ఇక అంతే అని అనుకున్నారు అందరు.


 కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక ఆటగాడిగా అద్భుతంగా రాణించడమే కాదు ఒక కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ విజేతగా నిలిపాడు. దీంతో అందరి దృష్టి అతని వైపు మర్లింది అన్న విషయం తెలిసిందే. నిజంగా చెప్పాలంటే ఈ ఏడాది ఐపీఎల్ హార్దిక్ పాండ్యా తానేంటో పూర్తిగా నిరూపించుకున్న సీజన్ అని చెప్పాలి. కానీ ఈ సీజన్ హార్దిక్ పాండ్యా కు పెద్ద షాక్ వచ్చిందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చెబుతున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్ వేలం సమయంలో హార్దిక్ పాండ్య ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఇటీవలే బయటపెట్టాడు రవిశాస్త్రి.


 మెగా వేలంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోకపోవడంతో అతను షాక్ లో మునిగిపోయాడు అంటూ రవిశాస్త్రి తెలిపాడు. ముంబై ఇండియన్స్ తనను పక్కన పెట్టడం పై కాస్త నిరాశ చెందాడు అంటూ తెలిపాడు రవి శాస్త్రి . అయితే ముంబై ఇండియన్స్ కూడా అప్పుడు పెద్ద సమస్య లోనే ఉంది.. ఇషాన్  కిషన్, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లో కేవలం ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్  హార్దిక్ పాండ్యాను వదులుతుంది అంటూ రవి శాస్త్రి  చెప్పుకొచ్చాడు. ఇక ముంబై వదులుకోవడం వల్ల హార్దిక్ పాండ్యాకు గుజరాత్ కెప్టెన్గా అదృష్టం కలిసి వచ్చింది అంటూ తెలిపాడు  రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: