సరిగ్గా ఐపీఎల్ ముందు వరకూ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంతలా విమర్శలు ఎదుర్కున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు భుజం గాయం కారణంగా బౌలింగ్ కు దూరం కావడం.. మరోవైపు బ్యాటింగ్లో పట్టు కోల్పోవడంతో ఇక హార్దిక్  పై ఎంతోమంది విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ళ పాటు అటు టీమిండియాకు కూడా హార్థిక్ పాండ్య దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవల ఐపీఎల్ సీజన్ లో మాత్రం హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చాడు. ముంబై నుంచి బయటికి రావడంతో ఏకంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ కూడా అందుకున్నాడు.


 ఇక మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ అందించి అదరగొట్టేశాడు హార్దిక్ పాండ్య. తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకొని తర్వాత అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా హార్థిక్ పాండ్య అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అసాధారణమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా అదరగొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. ముందుగా బౌలింగ్లో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాదు బ్యాటింగ్లో  76 పరుగులతో రాణించాడు.


 పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను ఆదుకోవడంలో హార్దిక్ పాండ్యా ఎంతో కీలకంగా వ్యవహరించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. మూడు ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసి 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు. అంతే కాదు ప్రపంచ క్రికెట్లో రెండో క్రికెటర్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా కంటే ముందు పాకిస్థాన్ ఆల్రౌండర్ మహమ్మద్ హాఫిజ్ ఇక ఈ రికార్డు సాధించడం గమనార్హం. ఇక మూడో వన్డే మ్యాచ్లో విషయంతో.. టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: