జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో.. జట్టు ఓడిపోవడం  తప్ప మరో ఆప్షన్ లేదు అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్  చెలరేగి ఆడి ఓడిపోతుంది అనుకున్న జట్టును గెలిపిస్తే కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కిస్తే అతని పేరు మొత్తం మారుమోగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలాగే రిషబ్ పంత్ పేరు  మార్మోగిపోతోంది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పటికే టి20 సిరీస్ గెలిచిన టీమిండియా ఇక వన్డే సిరీస్ గెలవాలంటే మూడో వన్డే మ్యాచ్లో తప్పక విజయం సాధించాల్సిందే.


 ఇలాంటి సమయంలో 72 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోవడంతో అందరూ నిరాశలో మునిగిపోయారు. ఇక టీమిండియా ఓటమి ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎవరు వచ్చినా 260 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని భావించారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 113 బంతుల్లో 125 పరుగులు చేసి అజేయంగా సెంచరీతో చెలరేగాడు. ఇక మరో వైపు నుంచి హార్దిక్ పాండ్యా 71 పరుగులతో మద్దతు అందించడం తో ఓడిపోతుంది అనుకున్న టీమిండియా గెలిచింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.


 ఈ క్రమంలోనే తన అద్భుతమైన సెంచరీ పై మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంత్  సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సెంచరీ  జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఇంగ్లాండ్లో ఆడటం ఎప్పుడు మజా ఉంటుందని చెప్పుకొచ్చాడు పంత్. ఈ విషయంలో బౌలర్ల పాత్ర కూడా ఉందని తెలిపాడు. ఇక జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఆ కిక్కు వేరే ఉంటుంది అంటూ రిషబ్ పంత్ తెలిపాడు.  భారీ ఇన్నింగ్స్ ఆడటం కోసం ఏమాత్రం ప్లాన్ చేసుకోలేదు. బాటింగ్  చేసేటప్పుడు నేను ఆడబోయే బంతిని ఎలా ఎదుర్కోవాలి అన్నది మాత్రమే మనసులో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: