టీమ్ ఇండియా యువ ఆటగాడు కీపర్ మరియు బ్యాట్స్మన్ అయిన రిషబ్ పంత్... ఒకప్పటి కుర్రాడిలా ఇప్పుడు లేడు అని చెప్పాలి. కాలం పెరుగుతున్న కొద్దీ ఆటతీరులో మార్పులు తెచ్చుకుని పరిణితి చెందుతున్నాడు. ఇందుకు ప్రధాన సాక్ష్యాలు నిన్న ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో ఏ బ్యాట్స్మన్ కు వీలు కానీ విధంగా తాను సాధించిన రెండు సెంచరీలు. కానీ ఒకప్పుడు పంత్ ఇలా ఉండేవాడు కాదు... క్రీజులోకి వెళ్లాడా బంతి పడగానే భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడా ? ఇలా ఉండేది. కానీ గత కొంత కాలంగా పూర్తిగా మారి పోయాడు. ఇందుకు పంత్ తనను తాను అన్ని విధాలుగా మార్చుకున్నాడు.

ముఖ్యంగా కీపింగ్ లోనూ బాగా రాటుదేలాడు. వికెట్ల వెనకాల అద్భుతమైన క్యాచ్ లను అందుకుంటున్నాడు. కాగా నిన్న పంత్ చేసిన మ్యాచ్ విన్నింగ్ సెంచరీ గురించి క్రికెట్ ప్రపంచం అంతా గర్వంగా చెప్పుకుంటోంది. కష్టాల్లో ఉన్న టీం ఇండియాను ఒక యువ ఆటగాడు ఎంతో పరిణితి చెందిన ఆటతో విజయాన్ని అందించి సిరీస్ డిసైడర్ లో  ఇండియాకు మరో టైటిల్ ను అందించాడు. అయితే ఈ విధంగా పంత్ ఆడేది చాలా తక్కువ సార్లు అని చెప్పాలి. ఎందుకంటే పంత్ కు సహనం కన్నా కూడా వేగంగా ఆడాలన్న కసి ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని సార్లు టీం ఏ పరిస్థితిలో ఉంది అన్నది చూడకుండా దూకుడుగా ఆడి వికెట్ ను పారేసుకుంటూ ఉంటాడు.

ఆ ఆటతీరును పక్కన పెట్టేసి నిన్న ఆడిన విధంగా కనుక ఓపికగా బంతి బంతిని చూసి ఆడితే పంత్ ఇంకా సెంచరీల మీద సెంచరీలు చేయగలడు. మరి ఇదే ఫామ్ ను ముందు ముందు కొనసాగించగలడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని మ్యాచ్ ల వరకు ఆగాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: