బెన్ స్టోక్స్ ఈ పేరు చెబితే చాలు ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఆల్రౌండ్ ప్రదర్శన గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టు తరఫున ఎన్నోసార్లు వీరోచితమైన పోరాటం చేసి జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు స్టోక్స్. ఇటు తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి బెన్ స్టోక్స్ ఇటీవలే టెస్ట్ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతని అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల ఎవరూ ఊహించని విధంగా టీమిండియాతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే తన వన్డే ఫార్మాట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తు నిర్ణయం తీసుకున్నాడు.


 ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఒక ఆటగాడు శారీరక ఇబ్బందులు గురించి అతడే బాగా అర్థం చేసుకుంటాడు అంటూ అజారుద్దీన్ తెలిపాడు. ఇంగ్లాండ్ క్రికెట్లో అత్యుత్తమ సేవలు అందించిన స్టోక్స్ ఒక గొప్ప ఆటగాడే కాకుండా స్వార్థపూరితంగా ఆలోచించి ఇక వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.


 బెన్ స్టోక్స్ రిటర్మెంట్ పై  విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ఇప్పటివరకు తాను చూసిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ అత్యంత పోటీ ఇచ్చే గొప్ప క్రికెటర్ అంటూ విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. అతడి నిర్ణయాన్ని ఎంతో గౌరవిస్తూ ఉన్నట్లు చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. కాగా బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే తన కెరీర్లో చివరి వన్డే అంటూ వెల్లడించాడు. అయితే మూడు ఫార్మాట్లకు ఆడటం ఎంతో శ్రమతో కూడుకున్నది. అది ఆటగాడికి  శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడమే కాదు.. మరో నాణ్యమైన ఆటగాడి అవకాశాన్ని  కూడా లాగేసుకుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు బెన్ స్టోక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: