ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా జట్టు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించిన విషయం తెల్సిందే. ముందుగా ఆడిన టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశపరిచినా ఆ తర్వాత టి 20 సిరీస్ లో అదరగొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్లో కూడా టీమిండియా జట్టు ఇంగ్లాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా రెండు విజయాలు సాధించి సిరీస్ను తమ బుట్టలో వేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా అరుదైన రికార్డును కూడా సృష్టించింది. అదే సమయంలో ఆతిథ్య ఇంగ్లండ్ కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.


 అప్పటికే ఇక టీమిండియా చేతిలో వరుసగా సిరీస్ లు ఓడిపోయామనే బాధ లో ఉన్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు అంతలోనే ఆ జట్టు స్టార్ క్రికెటర్ ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్  తన వన్డే ఫార్మాట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇటీవలే టెస్టు జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన బెన్ స్టోక్స్ ఇలా వన్డేలకు వీడ్కోలు పలకడం ఏంటి అని అవాక్కయ్యారు  అనే చెప్పాలి. మూడు ఫార్మాట్లకు క్రికెట్ ఆడటం ఒత్తిడితో కూడుకున్న పని అందుకే రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్.


 అయితే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్పై ఇటీవలే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెన్ స్టోక్స్ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ అంటూ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. అతనికి  వన్డే ఫార్మాట్ లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బెన్ స్టోక్స్  చాలా త్వరగా వన్డేల నుంచి రిటైర్ అయ్యాడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్ క్రికెట్ ఆడే శక్తి ఇంకా బెన్ స్టోక్స్లో law ఉంది అని భావిస్తున్నాను అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు యువరాజ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: