ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్గా కొనసాగుతూ అద్భుతమైన ఫామ్ లో దూసుకుపోతున్న బెన్ స్టోక్స్ ఇక ఇటీవల అనూహ్యంగా వన్డే ఫార్మాట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది అని చెప్పాలి. పూర్తి ఫిట్నెస్ తో మంచి ఫామ్లో ఉన్న బెన్ స్టోక్స్ అసలు ఎందుకు వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న. అయితే మూడు ఫార్మాట్లకు నిర్విరామంగా క్రికెట్ ఆడలేను అంటూ వివరణ ఇచ్చాడు బెన్ స్టోక్స్.


 ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇటీవల మీడియా తో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన రిటైర్మెంట్ కు పరోక్షంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కారణమంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. నా వన్డే రిటైర్మెంట్ తో నైనా మీరు మేల్కొంటే మంచిది అంటూ పరోక్షంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కి చురకలంటించాడూ. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కనీస గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూలు ఉండేలా చేస్తుంది క్రికెట్ బోర్డు. దీనివల్ల ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత కరువైంది. నా విషయంలో కూడా ఇదే జరిగింది. పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. కార్లు పెట్రోల్ పోస్తే ఎంత స్పీడ్ పెంచుతె అంత వేగంగా వెళ్తాయ్. కానీ మనుషులు తీరిక లేకుండా క్రికెట్ ఆడితే ఎవరైనా అలసిపోతారు.


 అలాంటి సమయం లోనే మాకు విశ్రాంతి అవసరం.. రెస్ట్ లేకుండా పరిగెత్తడం ఎవరి తరం కాదు. 36 ఏళ్ల తర్వాత నేను వెనక్కి చూసుకుంటే గొప్ప ఇన్నింగ్స్లు కనపడాలి తప్ప ఉరుకులు పరుగులు కాదు అంటూ బెన్ స్టోక్స్  కామెంట్ చేశాడు. నా వన్డే  రిటైర్మెంట్ తో నైనా ఈసీబీ మేల్కొంటే మంచిది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: