ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  హాట్ టాపిక్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతూ ఫిట్నెస్ లో కూడా ముందున్న బెన్ స్టోక్స్ ఇటీవలే తన కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనంగా మారింది. బిజీ షెడ్యూల్ కారణంగా తాను అలిసిపోయాను అని అందుకే రిటైర్మెంట్ ప్రకటించా అంటూ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఆటగాళ్లు కార్లు కాదు మనుషులు అన్న విషయాన్ని ఇప్పటికైనా ఇంగ్లాండు  క్రికెట్ బోర్డు గ్రహిస్తే  బాగుంటుంది అంటూ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇక చెప్పినట్లుగానే ఇటీవల దక్షిణాఫ్రికా టూర్ లో డార్హం వేదికగా చివరి వన్డే ఆడేశాడు. అయితే ఇక ఆటగాళ్లను ఇలా బిజీ షెడ్యూల్ ద్వారా అలసిపోయేలా చేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరో ముందడుగు వేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పై షాకింగ్ ఆరోపణలు చేశాడు కెవిన్ పీటర్సన్. షెడ్యూల్ చాలా భయంకరంగా ఉంది. నేను ఆడ లేనని గతంలోనే చెప్పాను. బిజీ షెడ్యూల్ కారణంగా అలసిపోయి వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాను. ఇలా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నన్ను టి 20ల నుంచి కూడా నిషేధించింది అంటూ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.


 కాగా కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరపున 104 టెస్టు మ్యాచ్లు ఆడి 8181 పరుగులు చేశాడు. 136 వన్డే మ్యాచ్ లు  4440 పరుగులు 37 టి-20 మ్యాచ్ లో 1176 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో కెవిన్ పీటర్సన్  ఎప్పుడూ కోల్డ్వార్ కొనసాగిస్తూ ఉండేవాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెవిన్ పీటర్సన్ కేవలం 10 ఏళ్ల పాటు మాత్రమే అటు ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించ గలిగాడు.. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 2014లో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇక భారత టి20 టోర్నీలో  కూడా పలు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు కెవిన్ పీటర్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి: