ఎంతో మంది ఎదురు చూస్తున్న కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్హామ్ వేదికగా జరగబోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇక ఈ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ క్రమంలోనే ఇక ఈ సారి కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా టి20 ఫార్మాట్ టోర్నీ కూడా జరగబోతోంది అన్న విషయం తెలిసిందే  ఈ టోర్నీలో భాగంగా ఎన్నో జట్లు పాల్గొనబోతున్నాయ్. అయితే ఇక క్రికెట్ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొన్నప్పటికీ అటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులలో ఎప్పుడు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్ పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సిద్ధం అవుతున్నాయి.


కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా టి-20 ఫార్మెట్లో జరిగే ఈ టోర్నమెంట్ ఆస్ట్రేలియా బార్బీడోస్ జట్లతో పాటు పాకిస్తాన్ టీమ్ ఇండియా జట్టు గ్రూప్ ఏ  లో ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే కామన్వెల్త్ క్రీడల్లో మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా జట్టు రెండో మ్యాచ్లో ప్రత్యర్థి పాకిస్థాన్తో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ జట్టు కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా బార్బడోస్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే ఎప్పుడు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు ఒక రేంజిలో ఆసక్తి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 కాగా జూలై 31వ తేదీన బర్మింగ్హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని తెలుస్తుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ సోనిలివ్లో ఇక ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఇరు జట్ల పూర్తి వివరాలు చూసుకుంటే

భారత జట్టు:
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్‌ కీపర్‌), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్‌, జెమీమా రోడ్రిగెస్‌, రాధా యాదవ్, హర్లీన్ డియోల్‌, స్నేహ్‌ రాణా.

స్టాండ్‌ బై ప్లేయర్లు:
సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌, రిచా ఘోష్‌, పూనమ్‌ యాదవ్‌

పాకిస్తాన్‌ జట్టు:
బిస్మా మరూఫ్‌(కెప్టెన్‌), ముబీనా అలీ(వికెట్‌ కీపర్‌), ఆనమ్‌ అమిన్‌, ఐమన్‌ అన్వర్‌, డయానా బేగ్‌, నిదా దర్‌, గుల్‌ ఫిరోజా(వికెట్‌ కీపర్‌), తుబా హసన్‌, కైనట్‌ ఇంతియాజ్‌, సాదియా ఇక్బాల్‌, ఈరమ్‌ జావేద్‌, అయేషా నసీమ్‌, అలియా రియాజ్‌, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: