ఇండియా తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న  బెన్ స్టోక్స్ ఏకంగా వన్డే క్రికెట్ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు అంటూ ప్రకటించి అభిమానులందరినీ కూడా ఆశ్చర్యం లో ముంచెత్తాడు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి బెన్ స్టోక్స్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 డార్హమ్  వేదికగా జరిగిన మ్యాచ్ ఇక తన వన్డే కెరీర్లో చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు. ఈ క్రమం లోనే ఇక బెన్ స్టోక్స్ చివరి వన్డే మ్యాచ్ చూసేందుకు అభిమానులు అందరూ కూడా స్టేడియం కు తరలి వచ్చారు అని చెప్పడంలో అతి శయోక్తి లేదు. అయితే చివరి వన్డే మ్యాచ్లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ డర్హామ్ పేరిట జరిగిన మ్యాచ్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు బెన్ స్టోక్స్.


 అయితే చివరి వన్డే మ్యాచ్లో బెన్ స్టోక్స్ ఏకంగా తన అభిమాని కి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైస్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన క్యాప్ ను స్టేడియం లో ఉన్న ఒక అభిమాని కి ఇచ్చి  అందరి మనసులు గెలుచుకున్నాడు ఈ స్టార్ ఆల్రౌండర్. బెన్ స్టోక్స్ వికెట్ కోల్పోయి మైదానం వీడుతున్న సమయం లో అందరూ చప్పట్లు కొడుతూ  వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్లో 5 ఓవర్లు బౌలింగ్ వేసిన బెన్ స్టోక్స్ ఒక వికెట్ కూడా తీసుకోలేక పోయాడు. తనకు క్యాప్ పై సంతకం చేసి ఒక పిల్లాడికి ఇవ్వడం మాత్రం హాట్ టాపిక్ గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: