టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని మరికొన్ని రోజుల్లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే టీ20 లీగ్ లో ఆడబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిసిసీఐ ఐపీఎల్ నిర్వహించినట్లు గానే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ప్రత్యేకమైన లీగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. అయితే పేరుకి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ అయినప్పటికీ ఇక్కడ టోర్నీ లోని అన్ని జట్లను   ఐపీఎల్ ఫ్రాంఛైజీల కొనుగోలు చేశాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి లో ఇక సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ సీజన్ ప్రారంభించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ప్రస్తుతం కసరత్తులు ప్రారంభించింది.


టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొన పోతున్నాయి.. ఇక ఒక్కసారి ఆ జట్ల వివరాలు చూసుకుంటే.. కేప్‌టౌన్‌ను-ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ, జోహన్నెస్‌బర్గ్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ, డర్బన్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌, పోర్ట్‌ ఎలిజిబెత్‌- ఎస్‌ఆర్‌హెచ్‌, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్‌, పార్ల్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలు దక్కించకున్నాయి అన్నది తెలుస్తుంది.  అయితే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ముందుకు నడిపిస్తున్న మహేంద్రసింగ్ ధోని సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కి  చెందిన జోహన్నెస్‌బర్గ్‌ జట్టును  నడిపించనున్నాడనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


 దీంతో ఈ వార్త అటు ధోని అభిమానులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది  అని చెప్పాలి. అనుకున్నట్లుగానే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరఫున సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి కూడా మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. సి ఎస్ కే అంటే ఒక బ్రాండ్ అన్న విధంగా ఐపీఎల్లో ఆ జట్టుకు క్రేజ్ తెచ్చిపెట్టాడు. తన కెప్టెన్సీ లో నాలుగు సార్లు టైటిల్ కూడా అందించాడు మహేంద్రసింగ్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: