మొన్నటి వరకు ఇంగ్లాండ్ జట్టు లోని మూడు ఫార్మాట్లలో కూడా కీలక ఆల్ రౌండర్ గా కొనసాగిన బెన్ స్టోక్స్ ఇండియా తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తన వన్డే కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న అంటూ చెప్పడం సంచలనంగా మారిపోయింది. ప్రతి ఒక్కరిని కూడా బెన్ స్టోక్స్  నిర్ణయం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బెన్ స్టోక్స్ ఏంటి రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటి అంటూ అందరూ షాక్ లో మునిగిపోయారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఒత్తిడి తట్టుకోలేక  రిటైర్మెంట్  ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.


 ఇలాంటి సమయంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మనుగడ గురించి కూడా చర్చ తెరమీదికి వస్తోంది అని చెప్పాలి. వన్డే లను  తగ్గించి టీ-20లు టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు కూడా వస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ లో వన్డేలు తగ్గించేందుకు ప్రయత్నించాలి అంటూ ఇక అన్ని దేశాల క్రికెట్ పాలకవర్గాలకు ఒక సూచన చేశాడు వసీం అక్రమ్.


 ఈక్రమంలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్  తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. అయితే టీ20 ఫార్మాట్ తో పోల్చి చూస్తే వన్డే ఫార్మాట్లో ఆటగాళ్లు ఎక్కువగా అలసటకు గురవుతారు అంటూ వెల్లడించాడు. బెన్ స్టోక్స్ లాంటి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ రిటైర్మెంట్  ప్రకటించడం బాధాకరమే. కానీ అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నా.. ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్ వేగంగా ప్రాభవం  కోల్పోతుంది అని కామెంటేటర్ గా చెప్పగలను. టి20 ఫార్మాట్  పెద్దఎత్తున ప్రేక్షకాదరణ అందుతోంది. ఇక ఆటగాళ్లు కూడా వన్డే ఫార్మాట్ ఆడాలని కోరుకోవడం లేదు. ఇక టీ20 ఫార్మాట్ కు అలవాటు పడుతున్నట్లు ఆటగాళ్లు  వన్డే క్రికెట్ వల్ల అలసటకు గురి అవుతున్నారు. దీంతో వన్డే క్రికెట్ అంతరించే స్థాయికి చేరుకుంది అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: