గత కొంత కాలం నుంచి టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా ఎన్నోసార్లు అద్భుత ప్రదర్శనతో తో టీమిండియాను విజయతీరాలకు నడిపించాడు అని చెప్పాలి. ఇక బ్యాట్ తో బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయే రవీంద్ర జడేజా తన స్పిన్ బౌలింగ్ మాయాజాలంతో ఎప్పుడూ కీలకమైన వికెట్లు పడగోడుతూ  ఉంటాడు  అనే విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఆడినా మూడు ఫార్మాట్ల మ్యాచ్ లలో కూడా ఎంతో కీలకంగా వ్యవహరించిన రవీంద్ర జడేజా వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మోకాలి గాయం కారణంగా మొదటి వన్డే మ్యాచ్ కు రవీంద్ర జడేజా దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే  మొదటి వన్డే మ్యాచ్ కు దూరమైన రెండో మ్యాచ్ కి మాత్రం అందుబాటులో కి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.


 ఈ క్రమం లోనే  వెస్టిండీస్ భారత్ మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ కి కూడా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం అవుతున్నాడు. ఇటీవల ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. కుడి కాలి గాయం కారణం గానే మొదటి వన్డే మ్యాచ్ కి జడేజా ఆడలేదని ప్రస్తుతం జడేజా వైద్య బృందం పర్యవేక్షణ లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్ కి కూడా అతడు దూరం అవుతాడని మూడో వన్డేకు అందుబాటులో ఉండటంపై అప్డేట్ ఇస్తాము అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: