గత కొంతకాలం నుంచి వరుస విజయాలతో సత్తాచాటిన భారత మహిళల జట్టుకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే.  ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ ఆడేందుకు అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే  కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా టి20 టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. టి20 టోర్నీలో పాల్గొనేందుకు అన్ని దేశాల జట్లు కూడా ప్రస్తుతం బర్మింగ్హామ్ బయలుదేరుతూ ఉన్నాయి.  బీసీసీఐ కూడా ఇప్పటికే కామన్ వెల్త్ గేమ్స్ లో జరగబోయే టి20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది.


 కాగా ఈ కామన్వెల్త్ గేమ్స్ ఈనెల 28వ తేదీన జరగబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే.. ఇక కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడబోతుంది టీమిండియా. ఇక ఈ సారి కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి. బర్మింగ్హామ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కి బయల్దేరడానికి 48 గంటల ముందు భారత మహిళా క్రికెట్ జట్టు లోని ఆరుగురు సభ్యులకు వీసా అంద లేకపోవడం గమనార్హం.


 ఇలా వీసా అందని వారిలో ముగ్గురు క్రీడాకారులు ఉండగా ముగ్గురు సహాయక సిబ్బంది ఉన్నారు అని తెలుస్తోంది. ఈ విషయంలో అటు బిసిసిఐ స్వయంగా రంగంలోకి దిగింది అని సమాచారం. ఈ క్రమంలోనే భారత ఒలింపిక్ సంఘం తో బిసిసిఐ సంప్రదింపులు జరుగుతుందట. ఈ క్రమంలోనే ఇక రానున్న రోజుల్లో వీసా పొందని క్రీడాకారులను సిబ్బందిని బర్మింగ్హామ్ ఎలా తరలిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఎన్నో ఏళ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో అటు క్రికెట్కు అవకాశం దక్కడంతో ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: