ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో స్టార్ ఆటగాడు గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ ఊహించని విధంగా వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించుకుండా ఉండి ఉంటే బాగుండేది అని ఎంతోమంది అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్రాంతి లేకుండా వరుసగా బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు స్టోక్స్ వివరణ ఇచ్చాడు. తాము పెట్రోల్ పోస్తే నడిచే కార్లము కాదని తాము కూడా మనుషులమే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు బెన్ స్టోక్స్.


 ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ పై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. కొన్నాళ్ల పాటు వన్డే క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసే సత్తా ఉన్నప్పటికీ బెన్ స్టోక్స్ కాస్త ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించాడు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది స్పందిస్తూ బెన్ స్టోక్స్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు అంటూ అతనికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారూ. ఇటీవలి కాలంలో ఇలా ఒత్తిడి లో మునిగి పోయిన వాళ్ళు కూడా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్  వన్డే రిటైర్మెంట్ పై మొదటిసారి స్పందించాడు ఆ జట్టు హెడ్ కోచ్ మెకల్లమ్. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ కి మద్దతుగా నిలిచాడు అనే చెప్పాలి. ప్రస్తుతం బెన్ స్టోక్స్  నిర్ణయంతో సంతోషంగానే ఉన్నాను. ఆ నిర్ణయం తీసుకునేంత విలాసవంతమైన స్థితిలో అతను ఉండవచ్చు.  తీరికలేని షెడ్యూల్ ఒకవైపు టెస్ట్ కెప్టెన్సీ అతనికి అతిగా అనిపించిందేమో.. తన కుటుంబం గురించి కూడా ఆలోచించి ఉంటాడు. ఇక వ్యూహాలు రచించేందుకు అతనితో ఎక్కువ సమయం గడుపుతా అంటూ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్  చెప్పుకొచ్చాడు. ఇక మిగతా ఆటగాళ్లు ఇదే ధోరణి అవలంభిస్తారా అంటే ఆ విషయం నాకు తెలియదు.. ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లు మాత్రం తక్కువగానే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: