ఇటీవల భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టేడియంలో నేరుగా మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అందరిని కూడా మునివేళ్ళపై నిలబెట్టింది అని చెప్పాలి. ఇక చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో మూడు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన సమయంలో వెస్టిండీస్ జట్టు కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మూడు పరుగుల తేడాతో భారత జట్టుకు విజయాన్ని ఖరారు అయ్యింది.

 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. చివరి బంతి ఫోర్ వెళ్లకుండా సంజూ శాంసన్ గాల్లోకి డైవ్ చేసి మరీ బంతిని ఆపిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ బాదిన షాట్ ను  కళ్ళు చెదిరే విధంగా క్యాచ్ పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 57 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అర్థ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అదిరిపోయే క్యాచ్ పట్టుకొని శ్రేయస్ అయ్యర్ ను పెవిలియన్ పంపించాడు.


 ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. 36 ఓవర్ వేయడానికి మోతీ బౌలింగ్కు వచ్చాడు. ఎంతో దూకుడు మీదున్న శ్రేయస్ అయ్యర్ కవర్స్ మీదుగా ఒక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కొట్టిన బంతి బుల్లెట్ లాగా బౌండరీ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న నికోలస్ పూరన్ గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నికోలస్ పూరన్ ఎంతో వేగంగా వచ్చిన బంతిని టెక్నికల్గా క్యాచ్ పట్టడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు నేటిజన్లు. కాగా సన్రైజర్స్ జట్టులో నికోలస్ పూరన్ ఈ ఏడాది ఆడాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: