ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా పోటీలలో అన్ని దేశాల క్రీడాకారులు కూడా పాల్గొని తమ దేశానికి బంగారు పతకం అందించడమే లక్ష్యంగా పోటీపడ్డారు. అయితే ఇక భారత్ నుంచి కూడా ఎంతో మంది క్రీడాకారులు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్నారు. అయితే ఇక ఈ మెగా పోటీలలో అటు భారత్ కు ఎప్పుడు చేదు అనుభవమే ఎదురవుతుంది. ఇన్నేళ్లలో  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో భారత్  సాధించింది ఒకే ఒక పథకం మాత్రమే. అది కూడా రజతం కావడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో ఈ ఏడాది క్రీడాకారులు తప్పకుండా భారత్ కి బంగారు పతకాన్ని సాధించి పెడతారు అని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. గత ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కి గోల్డ్ మెడల్ సాధించి పెట్టి ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దింపిన నీరజ్ చోప్రా కూడా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇక అందరి ఆశలు కూడా అతని పైనే ఉండిపోయాయి అని చెప్పాలి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాడు అని అందరు నమ్మకం పెట్టుకున్నారు.

 కానీ ఒలంపిక్ గోల్డ్మెడలిస్ట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మాత్రం గోల్డ్ మెడల్ కు అడుగు దూరంలోనే ఆగిపోయాడు.  జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్లో 88.13 మీటర్ల త్రో విసిరి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు.  ఇక గోల్డ్ మెడల్ సాధించిన అండర్సన్ 90.46 మీటర్ల దూరం విసిరాడు అనే చెప్పాలి. గోల్డ్ మెడల్ మిస్ అయినప్పటికీ ఇక సిల్వర్ మెడల్ దక్కడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో గెలిచిన రెండవ భారతీయుడిగా గుర్తింపు సంపాదించాడు  నీరజ్. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: